Peddapalli: కూనారం వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఇంజన్!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కూనారం రైల్వే గేట్ సమీపంలో తప్పిన ప్రమాదం. గూడ్స్ రైలు ఇంజన్ పట్టాలు తప్పడంతో నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు. పునరుద్ధరణ పనులు వేగవంతం.
Peddapalli: కూనారం వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఇంజన్!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కూనారం రైల్వే గేట్ సమీపంలో గూడ్స్ రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. కూనారం వద్ద ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) సమీపంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇంజన్ పట్టాలు తప్పడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. సాంకేతిక లోపమా లేక ట్రాక్ సమస్యా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.




