Manthani: సౌత్‌జోన్‌ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన నల్లవెల్లి ఆనంది!

Manthani: పుదుచ్చేరిలో జరిగిన 37వ సౌత్‌జోన్ ఛాంపియన్‌షిప్‌ అండర్-18 400 మీటర్ల పరుగు పందెంలో పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌కు చెందిన నల్లవెల్లి ఆనందికి స్వర్ణ పతకం.

SHANKAR, MANTHANI
Published on: 17 Sept 2026 7:54 PM IST
Manthani
X

Manthani: సౌత్‌జోన్‌ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన నల్లవెల్లి ఆనంది!

మంథాని: పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో గురువారం నిర్వహించిన 37వ సౌత్‌జోన్‌ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌–18 విభాగం 400 మీటర్ల పరుగు పందెంలో పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి ఆనంది బంగారు పతకం సాధించి తెలంగాణకు, కమాన్‌పూర్‌కు కీర్తి తీసుకొచ్చింది. గతంలోనూ ఆనంది జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించడంతో పాటు గత ఏడాది సౌత్‌జోన్‌ పోటీల్లోనూ బంగారు పతకం సాధించింది.

ప్రస్తుతం ఆనంది కమాన్‌పూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కమాన్‌పూర్‌కు చెందిన నల్లవెల్లి భారతి–శంకర్‌ దంపతుల రెండో కుమార్తె అయిన ఆనంది చిన్ననాటి నుంచే పరుగుపందెంలో ప్రతిభ కనబరుస్తోంది. క్రీడలతో పాటు చదువులోనూ రాణిస్తూ ప్రథమ సంవత్సరం సీఈసీలో కళాశాల టాపర్‌గా నిలిచింది. క్రీడలు, విద్య రెండింటిలోనూ ప్రతిభ చాటుతున్న ఆనందిని స్థానికులు అభినందిస్తూ, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI