Manthani: బీటలు బారిన వరి పొలంలో బైక్‌తో తిరుగుతూ రైతు వినూత్న నిరసన!
Manthani: మంథనిలో విద్యుత్ సరఫరా సరిగా లేక పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆందోళన ఖానాపూర్ రైతు శ్రవణ్ కుమార్ బీటలు వారిన వరి పొలంలో బైక్‌తో తిరుగుతూ వినూత్న నిరసన.
Manthani: బీటలు బారిన వరి పొలంలో బైక్‌తో తిరుగుతూ రైతు వినూత్న నిరసన!
Manthani: విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని పెద్దపల్లి జిల్లా మంథని మండల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, మరోవైపు విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు.
మంథని మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన రైతు నారమళ్ల శ్రవణ్ కుమార్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తన వరి పొలంలో బైక్‌తో తిరుగుతూ విద్యుత్ సమస్యపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.... కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి నది సమీపంలో ఉన్నప్పటికీ తమ పంట పొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలకు నీరందక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక బోర్లకు అమర్చిన మోటార్లు కాలిపోతున్నాయని, దీంతో అదనపు ఆర్థిక భారం పడుతోందని వాపోయారు.
లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు ఎండిపోతే అప్పుల భారం మరింత పెరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పంటలను కాపాడుకునేందుకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును రైతులు కోరారు.




