Peddapalli: పెద్దపల్లిలో వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Peddapalli: పెద్దపల్లి పట్టణం 3వ వార్డులో మాజీ మున్సిపల్ చైర్మన్ దాసరి మమతా రెడ్డి, మాజీ కౌన్సిలర్ బిక్షపతి ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ ఘనంగా జరిగింది.
Peddapalli: పెద్దపల్లిలో వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Peddapalli: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి పట్టణం 3వ వార్డు కేంద్రంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ లైశెట్టి బిక్షపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ దాసరి మమతా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వార్డులోని మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులంతా సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని సందడి చేశారు.
ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




