Manthani: ఇంటర్ ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలి: డీఐఈవో దాసరి కల్పన!
Manthani: మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను పెద్దపల్లి డీఐఈవో దాసరి కల్పన తనిఖీ చేశారు. నవంబర్ చివరికల్లా సిలబస్ పూర్తి చేసి ఉత్తీర్ణత శాతం పెంచాలని ఆదేశించారు.
Manthani: ఇంటర్ ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలి: డీఐఈవో దాసరి కల్పన!
మంథాని: కళాశాలలో ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని పెద్దపెల్లి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని దాసరి కల్పన అన్నారు. సోమవారం మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు పరిశీలించి విద్యార్థుల సామర్థ్యాల పెంపకంపై అధ్యాపకులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల నోటు పుస్తకాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం కచ్చితంగా ఎఫ్ఆర్ఎస్ లో నమోదు చేయాలని, ప్రతి ఒక్కరూ కళాశాలకు సకాలంలో హాజరయ్యాలా చూడాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉందన్నారు. ఈనెల చివరిలోగా పాఠ్యాంశాలను పూర్తి చేసి డిసెంబర్ నుండి రివిజన్ ప్రారంభించాలని సూచించారు.
కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పించిందని యూనిఫాం, నోటు పుస్తకాలు, బ్యాగు, షూలు, ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం రుచికరమైన భోజనం కూడా అందిస్తున్నామన్నారు. డ్రాప్ఔట్ల సంఖ్య తగ్గించి ఎక్కువ మంది విద్యార్థులు తరగతిలో ఉండేలా చూడాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో నిరంతరం మాట్లాడుతూ వారి ప్రగతిని అంచనా వేయాలన్నారు. ఆమె వెంట ప్రిన్సిపల్ భూక్య బాలోజీ, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.




