Peddapalli: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు: ధర్మారం ఎస్ఐ!
Peddapalli: బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి సేవిస్తే కఠిన చర్యలు పెద్దపల్లి జిల్లా ధర్మారం ఎస్ఐ శ్రీకాంత్ హెచ్చరిక డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కేసులు, సమాచారం ఇవ్వాలని పిలుపు.
Peddapalli: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు: ధర్మారం ఎస్ఐ!
పెద్దపల్లి: బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపై, పార్కులు, ఖాళీ ప్రదేశాలు లేదా ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టవిరుద్ధమని పెద్దపల్లి జిల్లా ధర్మారం ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ప్రజలు మద్యం సేవించాల్సి వస్తే అనుమతించబడిన ప్రదేశాల్లో లేదా తమ నివాసంలో మాత్రమే సేవించాలని సూచించారు.
అదేవిధంగా మద్యం సేవించిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపకూడదని, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను సేవిస్తున్నట్లు లేదా విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ శ్రీకాంత్ ప్రజలను కోరారు.
సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. మద్యం లేదా మత్తు పదార్థాల ప్రభావంలో వాహనాలు నడపడం వల్ల డ్రైవర్‌తో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని,ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా వ్యవహరించి రోడ్డు భద్రతకు, శాంతిభద్రతలకు సహకరించాలని ఎస్‌ఐ శ్రీకాంత్ కోరారు.
మద్యం సేవిస్తే వాహనం నడపవద్దు – మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి – గంజాయి, మత్తు పదార్థాల వినియోగం లేదా విక్రయంపై పోలీసులకు సమాచారం అందించండి ఎస్ఐ. శ్రీకాంత్ అన్నారు.




