Peddapalli: శాయంపేటలో సీసీ కెమెరాలను ప్రారంభించిన డీసీపీ రాంరెడ్డి!

Peddapalli: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం శాయంపేటలో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను డీసీపీ భూక్యా రాంరెడ్డి నాయక్ ప్రారంభించారు.

RAMESH, DHARMPURI
Published on: 15 Oct 2026 3:48 PM IST
Peddapalli
X

Peddapalli: శాయంపేటలో సీసీ కెమెరాలను ప్రారంభించిన డీసీపీ రాంరెడ్డి!

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం శాయంపేట గ్రామంలో నేరాల నియంత్రణ ప్రజల భద్రత శాంతిభద్రతల పరిరక్షణ అధ్యాయంగా నూతనంగా దాతల సహకారంతో ఒక లక్ష 12వేల రూపాయలతో ఏర్పాటు చేసిన 8 సిసి కెమెరాలను శుక్రవారం రోజున. పెద్దపల్లి డిసిపి భూక్యా రాంరెడ్డి నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై నిఘానేత్రాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా డిసిపి భూక్యా రాంరెడ్డి నాయక్, మాట్లాడుతూ గ్రామాలలో నేరాల అదుపుకు అసాంఘిక శక్తుల కదిలిక పై నిఘ ఉంచడానికి సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని,గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నిరోధించడానికి ఉపయోగం. అలానే నేరాలు జరిగిన నిందితులను త్వరగా గుర్తించడానికి ఈ కెమెరాలు ఎంతగానో ఉపయోగ పడతాయని అన్నారు.

అదేవిధంగా గ్రామస్తులు కూడా పోలీస్ యంత్రాంగానికి సహకరిస్తూ శాంతిభద్రత పరిరక్షణలో భాగ్యస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీ సహాయంతో నేరరహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏసిపి గజ్జి కృష్ణ,సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్.ఐ ఎంబడి శ్రీకాంత్,గ్రామ సర్పంచ్ కూస శ్రీవాణి-తిరుపతి ఉపసర్పంచ్ దయ్యాల రజిత తో పాటు వార్డు సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI