Peddapalli: దేవునిపల్లిలో వైభవోపేతంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం!
Peddapalli: పెద్దపల్లి మండలం దేవునిపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
Peddapalli: దేవునిపల్లిలో వైభవోపేతంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం!
పెద్దపల్లి: పెద్దపల్లి మండలం దేవునిపల్లి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన కల్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, వేదమంత్రాల నడుమ కల్యాణ వేడుకను అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపించారు. కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.




