Peddapalli: గర్రెపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన!

Peddapalli: పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులకు సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై డీసీపీ బి. రామిరెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు.

KONDAL, SULTANABAD
Published on: 11 Nov 2026 4:50 PM IST
Peddapalli
X

Peddapalli: గర్రెపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన!

పెద్దపల్లి: విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, ఉన్నత లక్ష్యాలతో భావి భారతాన్ని నిర్మించాలని పెద్దపల్లి డీసీపీ బి. రామిరెడ్డి పిలుపునిచ్చారు. సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో గర్రెపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై గర్రెపల్లిలోని ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ రామిరెడ్డి, ప్రవచనకర్త ఎస్పీ నాయక్‌లు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మత్తు పదార్థాలకు బానిసైతే జీవితాలు నాశనమవుతాయని, చిన్న వయస్సులోనే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

​కార్యక్రమంలో సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు, ఎస్ఐలు చంద్రకుమార్, మధుకర్ (ఎలిగేడు), సుధాకర్ (కాల్వ శ్రీరాంపూర్), పోలీసు సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD