Peddapalli: పెద్దపల్లిలో పత్తి నూనె మిల్లు యాజమాన్యం ఇష్టారాజ్యం!

Peddapalli: పెద్దపల్లి మండలం సబితం పరిధిలో పత్తి నూనె మిల్లు వ్యర్థాలను రోడ్డుపై వేసి నిప్పుపెడుతుండటంతో గ్రామస్తులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

RAJU, PEDDAPALLI
Published on: 2 Oct 2026 3:58 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లిలో పత్తి నూనె మిల్లు యాజమాన్యం ఇష్టారాజ్యం!

Peddapalli: పెద్దపల్లి మండలం సబితం గ్రామపంచాయతీ పరిధిలో గొల్లపల్లి గ్రామ శివారులో ఉన్న పత్తి నూనె మిల్లు యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

మిల్లు నుంచి వచ్చే వ్యర్థాలను, పత్తి చెత్తను గొల్లపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు పక్కన నడిరోడ్డు మీదనే గుట్టలుగా పోసి నిప్పు పెడుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసనతో, దట్టమైన పొగతో నిండిపోయింది.

ఈ రోడ్డు గుండా రోజూ వందలాది మంది ప్రజలు, రైతులు, విద్యార్థులు వెళ్తుండగా... వస్తున్న దుర్వాసన, పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంటల నుంచి వచ్చే బూడిద పక్కనే ఉన్న గొల్లపల్లి రైతుల పంట పొలాలపై పడి పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. భూమి సారం కూడా దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై గ్రామ పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని గొల్లపల్లి గ్రామ నివాసులు, రైతులు మండిపడుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పత్తి నూనె మిల్లుపై చర్యలు తీసుకోవాలని, రోడ్డు పక్కన చెత్త వేయకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI