Odela: ఓదెలలో బాలల గ్రామసభ ఘనం.. బెల్టు షాపుల నిషేధానికి ఆమోదం
Odela: పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ డాక్టర్ కనికిరెడ్డి సతీష్ ఆధ్వర్యంలో బాలల గ్రామసభ నిర్వహించి, బెల్టు షాపుల నిషేధాన్ని ఆమోదించారు.
Odela: ఓదెలలో బాలల గ్రామసభ ఘనం.. బెల్టు షాపుల నిషేధానికి ఆమోదం
ఓదెల: పిల్లల హక్కుల పరిరక్షణ మరియు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమష్టి బాధ్యతతోనే బాలల భవిష్యత్తు ముడిపడి ఉంటుందని ఓదెల గ్రామ సర్పంచ్ డాక్టర్ కనికిరెడ్డి సతీష్ అన్నారు. శనివారం స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ సతీష్ ఆధ్వర్యంలో "బాలల గ్రామసభ" నిర్వహించారు.
భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి (బాలల దినోత్సవం) సందర్భంగా ప్రజా ప్రభుత్వం ఈ ప్రత్యేక సభను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పిల్లలు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, ఉన్నతమైన మార్గంలో పయనించేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
అనంతరం గ్రామ ప్రజలు, యువత నుంచి వచ్చిన సుదీర్ఘ విజ్ఞప్తుల మేరకు గ్రామంలో బెల్టు షాపులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు గ్రామసభలో తీర్మానం చేసి ఆమోదించారు.
కార్యక్రమంలో భాగంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పిల్లలకు స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేయడంతో పాటు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకట లక్ష్మణ్, ఉపసర్పంచ్ గోపతి శ్రీలత, వార్డు సభ్యులు రాపెల్లి రాజయ్య, కొండ్ర లక్ష్మణ్, రాచర్ల అశోక్, చింతం స్వామి, అంగన్‌వాడీ సిబ్బంది, యువకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




