Peddapalli: 400 కి.మీ సైకిల్ యాత్ర పూర్తి బీఆర్ఎస్ బృందానికి ఘన సన్మానం
Peddapalli: మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు 400 కి.మీ సైకిల్ యాత్రను పూర్తి చేసిన బీఆర్ఎస్ బృందాన్ని పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సన్మానించారు.
Peddapalli: 400 కి.మీ సైకిల్ యాత్ర పూర్తి బీఆర్ఎస్ బృందానికి ఘన సన్మానం
పెద్దపల్లి: మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు 400 కిలోమీటర్ల సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన బీఆర్ఎస్ బృందాన్ని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
పెద్దపల్లికి చేరుకున్న యాత్ర బృందానికి తన స్వగృహంలో స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే, యాత్రలో పాల్గొన్న ఉప్పు రాజ్ కుమార్, కాశీపాక వాసు, సురేష్, లక్ష్మణ్ లకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఆత్మగౌరవం, రైతు సంక్షేమం, ప్రజా ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన ఈ యాత్ర అభినందనీయమన్నారు. రైతుల పట్ల నిబద్ధతకు, ఉద్యమ స్ఫూర్తికి ఈ యాత్ర నిదర్శనమని కొనియాడారు.
కార్యక్రమంలో యువ నాయకులు దాసరి ప్రశాంత్ రెడ్డి, మండల అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, కౌన్సిలర్ వెన్నం సుజాత రవీందర్, సుల్తానాబాద్ పట్టణ అధ్యక్షుడు గుణపతి, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ కొయ్యడ సతీష్ తదితరులు పాల్గొన్నారు.




