Peddapalli: పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగి గౌరవించిన బీజేపీ
Peddapalli: సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా పెద్దపల్లి జిల్లా జనగామ మండలంలో పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగి సత్కరించిన బీజేపీ శ్రేణులు, వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
Peddapalli: పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగి గౌరవించిన బీజేపీ
Peddapalli: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ లేబర్ సెల్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ తడగొండ నరసయ్య ఆధ్వర్యంలో జనగామ మండలంలో పారిశుధ్య కార్మికులను బీజేపీ శ్రేణులు ఘనంగా సన్మానించి వారితో పాటుగా సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై పారిశుధ్య కార్మికులను సన్మానించారు.
ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు కార్మికుల కాళ్లు కడిగి వారి పట్ల తమ గౌరవాన్ని, కృతజ్ఞతను చాటుకున్నారు.
గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికుల తెల్లవారుజామునే విధులకు హాజరై సేవలను అందిస్తూ ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రమైన పరిసరాల కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా విధులు నిర్వహిస్తున్న కార్మికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు అన్నారు.
ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ...
పారిశుధ్య కార్మికులు సమాజ ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మన చుట్టూ పరిశుభ్రమైన వాతావరణం ఉండటానికి వారి నిరంతర శ్రమే ప్రధాన కారణమని పేర్కొన్నారు.
ఎండ, వాన, చలి అనే తేడా లేకుండా ప్రతిరోజూ ప్రజల కోసం పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కార్మికుల పట్ల గౌరవాన్ని చాటేందుకు వారి కాళ్లు కడిగి సన్మానించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సేవాభావం, స్వచ్ఛత, సమాజ సేవ స్ఫూర్తితో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, సమాజం కోసం నిస్వార్థంగా సేవలందిస్తున్న వివిధ వర్గాలను గుర్తించి
గౌరవిస్తున్నామని,శ్రమించే చేతులకు గౌరవం ఇవ్వడమే నిజమైన సేవ అని కందుల సంధ్యారాణి పేర్కొన్నారు.
పారిశుధ్య కార్మికుల కష్టాన్ని సమాజం గుర్తించాలని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాలని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పేర్కొన్నారు. కార్మికుల సేవలను గౌరవించడం ద్వారా సమాజంలో శ్రమ పట్ల గౌరవ భావన మరింత పెరుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన తడగొండ నర్సయ్య గారిని కందుల సంధ్యారాణి అభినందించారు.
ఈ కార్యక్రమంలో జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణ ఎస్సీ మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మచ్చ విశ్వాస్,జిల్లా మహిళా మోర్చా జెనరల్ సెక్రెటరీ సులువ పద్మ బిజెపి పెద్దపల్లి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఎల్తూరి సరిత జిల్లా లేబర్ సెల్ కో కన్వీనర్, ఎల్తురీ రాజయ్య ,కోడూరి రమేష్ ,జనగామ సాగర్, మాదర బోయిన రాకేష్ , కొట్టే నరేష్, జక్కన బాలు, జక్కుల ప్రవీణ్ - పద్మ,రామగిరి నరేష్,సాతిరి గంగరాజు,బియ్యాల మహేందర్, శిలారపు కళ్యాణ్,జనగామ శివరాం, మీసవికాస్, జనగామ సాగర్, ఇరుగురాళ్ల శివకుమార్, దెబ్బట కమలాకర్, నడిగోట్టు రాజేందర్, అంకరి భరత్ తదితరులు పాల్గొన్నారు.




