Peddapalli: పెద్దపల్లిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం.. బీజేపీ రాస్తారోకో

Peddapalli: పెద్దపల్లి పట్టణంలోని రాజీవ్ రహదారిపై పోలీసుల భారీ బందోబస్తు మధ్యనే బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.

RAJU, PEDDAPALLI
Published on: 17 Nov 2026 9:44 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం.. బీజేపీ రాస్తారోకో

పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణంలో బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం సమీపంలోని పెద్ద కాల్వల స్టేజ్ వద్ద రాజీవ్ రహదారిపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్ల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

అనంతరం రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు పది మంది బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు, భారీ బందోబస్తు చేపట్టినప్పటికీ బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI