Peddapalli: విజయదశమి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ లో కుల సంఘాలతో ఏసీపీ గజ్జి కృష్ణ సమావేశం. విజయదశమి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచన.

Srimanthula Kondal, Peddapalli
Published on: 17 Oct 2026 7:56 PM IST
Peddapalli
X

Peddapalli: విజయదశమి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

పెద్దపల్లి: విజయదశమి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై గట్ల సుధాకర్ ఆధ్వర్యంలో దసరా వేడుకలు పై ఆయా కుల సంఘాలతో పెద్దపెల్లి ఏసిపి గజ్జి కృష్ణ సమావేశం నిర్వహించి దసరా వేడుకలు ప్రశాంతత వాతావరణం లో జరిగేలా పలు సూచనలు చేశారు.

ఈ సందర్బంగా ఏసీపీ గజ్జి కృష్ణ మాట్లాడుతూ ​ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల క్రితం చిన్నచిన్న మనస్పర్థలు, అభిప్రాయ భేదాల వల్ల దసరా ఉత్సవాలు సజావుగా జరగని పరిస్థితి ఉండేదని, అయితే 2024 నుంచి ఊరి పెద్దలు, యూత్ సభ్యుల సహకారంతో కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా దసరా జరుపుకుంటున్నారని తెలిపారు.

​ఈ సారి దసరా పండుగను కూడా గతంలో కంటే మరింత బ్రహ్మాండంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి 100 శాతం పోలీసు శాఖ తరఫున హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఊరి పరిస్థితిపై పరస్పర అవగాహన కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.కాల్వశ్రీరాంపూర్ ప్రజల ఐక్యతను మరోసారి చాటి చెప్పేలా వేడుకలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో సిఐ రంజిత్ రావు ఎస్సైలు గట్ల సుధాకర్, సనత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli