Peddapalli: 6వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: సాయికిరణ్!
Peddapalli: పెద్దపల్లి మున్సిపాలిటీ 6వ వార్డు సుభాష్ నగర్‌లో స్మార్ట్ రేషన్ కార్డులను కౌన్సిలర్ భాకం సాయికిరణ్ యాదవ్ పంపిణీ చేసి, సంక్షేమం గడపగడపకూ చేరుస్తామని స్పష్టం చేశారు.
Peddapalli: 6వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: సాయికిరణ్!
పెద్దపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రభుత్వ విప్ విజయ రమణారావు,ఆదేశాల మేరకు ఆరవ వార్డులో గడపగడపకు అమలు చేస్తానని, ఆరవ వార్డు కౌన్సిలర్ భాకంసాయికిరణ్ యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు సుభాష్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి కౌన్సిలర్ సాయికిరణ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై స్మార్ట్ రేషన్ కార్డులను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ ఆర వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులతో నిత్యవసర సరుకులతో పాటు ప్రతి పథకానికి స్మార్ట్ రేషన్ కార్డు ఉపయోగపడుతుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకు వెళ్తున్నారని, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని సాయికిరణ్ యాదవ్ కొనియాడారు.
విజయ రమణారావు సహకారంతో ఆరవ వార్డును సుందరంగా తీర్చిదిద్దుతానని, సమస్యలు లేని వార్డుగా ఆరవ వార్డు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిపిఓ మహేందర్ రెడ్డి అంగన్వాడి టీచర్ సరోజన కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాతరి దేవేందర్ కుమార్, ఆరేపల్లి రత్నం, తో పాటు వార్డ్ మహిళలు పాల్గొన్నారు.




