Peddapalli: పిడుగుపాటుకు గురై 24 గొర్రెలు మృతి
Peddapalli: పెద్దపల్లిలో పిడుగుపాటుకు 24 గొర్రెలు మృతి. బాధితులను పరామర్శించి ప్రభుత్వం తరఫున రూ.4 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేసిన గంట రాములు యాదవ్.
Peddapalli: పిడుగుపాటుకు గురై 24 గొర్రెలు మృతి
పెద్దపల్లి: పెద్దపల్లి మండలం మూలసాల గ్రామంలో మంగళవారం రోజున పిడుగుపాటుకు గురై 24 గొర్రెలు మృతి చెందగా సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికిp చేరుకొని నాయకులతో కలిసి పరిశీలించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఓదెల మాజీ జెడ్పిటిసి గంట రాములు యాదవ్.
ములసాల గ్రామానికి చెందిన బోయిన సదయ్య కాసు నరేష్ లకు చెందిన గొర్రెలు
అన్నయ్య కుంట చెరువు సమీపంలో మేపుతుండగా అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి ఒకేసారిగా పిడుగు పడటంతో మందలోని 24 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందినవి తమ కళ్ళముందే గొర్రెలు మృత్యువాత పడడంతో సదయ్య నరేష్ లు కన్నీరు మున్నీరయ్యారు వారికి గొర్రెలు పెంపకమే జీవనాధారంగ జీవితం కొనసాగిస్తున్నారు ఒకేసారిగా ఇంత పెద్ద సంఖ్యలో గొర్రెలు మృతి చెందడంతో బాధతో కన్నీరుమున్నీరయ్యారు సంఘటన స్థలానికి చేరుకున్న గంట రాములు యాదవ్ వీరికి వెంటనే ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మూలసల గ్రామస్తులు,యాదవ సంఘం సోదరులు,అశోక్,విజాలు, సుధాకర్,వెంకటేష్,మల్లయ్య, గోపారపల్లి సర్పంచ్ మధ్యనవేన రవి,ఓదెల మండలం యాదవ సంఘం అధ్యక్షులు వేల్పుల ఐలయ్య,చేలుకల అనిల్ తదితరులు పాల్గొన్నారు.




