Karimnagar: జంతర్ మంతర్‌లో యువకుల నిరసన అడ్డుకోవడాన్ని ఖండించిన పిడిఎఫ్!
Karimnagar: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సిజెపి యువకుల నిరసనపై పోలీసుల దిగ్బంధాన్ని ఖండించిన పిడిఎఫ్. రాబోయే ఉద్యమానికి సిద్ధం కావాలని కొరివి వేణుగోపాల్ పిలుపు.
Karimnagar: జంతర్ మంతర్‌లో యువకుల నిరసన అడ్డుకోవడాన్ని ఖండించిన పిడిఎఫ్!
Karimnagar: సీజేపీ యువకులు ఢిల్లీ నగరంలో జంతర్ మంతర్ లో అక్టోబర్ 10న తలపెట్టిన నిరసనను విఫలం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 40,000 పోలీసు బలగాలతో ఢిల్లీ నగరాన్ని దిగ్బంధించి ,57 మెట్రో రైల్వే స్టేషన్లకు తాళాలు వేసి పలు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వెళ్లే రైళ్లను రద్దుచేసి సిజెపి నాయకులను అరెస్టు చేసినప్పటికీ కూడా యువకులు విరోచితంగా పోలీసుల బలగాలను ఛేదించి పెద్ద ఎత్తున ఢిల్లీలో నిరసనలు తెలియజేయడం జరిగింది. అలాగే రానున్న ఉద్యమానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ పిలుపునిచ్చారు.
కరీంనగర్ కోర్టు వద్ద గల అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ చర్యల వలన దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు ప్రైవేటుపరం అయిపోయినాయి, అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పడిపోయిందన్నారు. నిత్యవసర ధరలు పెరిగిపోయి సగటు మనిషి జీవితాలు దుర్భరం అవుతున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సిగిరి శ్రీధర్, శ్రీరాముల కిషన్, పాటకుల భూమయ్య, గజ్జల ఆనందరావు, రవీందర్ లు పాల్గొన్నారు.




