Jammikunta: జమ్మికుంటలో పేషెంట్ సేఫ్టీ డే: డిప్యూటీ డీఎంహెచ్‌వో
Jammikunta: జమ్మికుంటలో వావిలాల పీహెచ్‌సీ ఆధ్వర్యంలో పేషెంట్ సేఫ్టీ డే సదస్సు, మున్సిపల్ కార్మికులకు వైద్య శిబిరం, వడ్డెర కాలనీలో డ్రైడే కార్యక్రమం నిర్వహించారు.
Jammikunta: జమ్మికుంటలో పేషెంట్ సేఫ్టీ డే: డిప్యూటీ డీఎంహెచ్‌వో
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చందన ఆధ్వర్యంలో ప్రజలకు పేషంట్ సేఫ్టీ డే మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ప్రభుదాసు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ హుజురాబాద్ హాజరై మాట్లాడుతూ ఆరోగ్య సేవలు పొందుతున్న ప్రతి రోగికి సేఫ్, క్వాలిటీ రోగికి భద్రత వైద్యం అందించే సమయంలో సంభవించే ప్రమాదాలను తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశం అని దీర్ఘకాలిక వ్యాధులు అయిన గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ మరియు శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో రోగులకు సురక్షితమైన వైద్యం అందేలా చూడడం తప్పులను నివారించడం వైద్య చికిత్స మందుల వాడకం రోగ నిర్ధారణలో జరిగే పొరపాట్లను తగ్గించడం,రోగుల భాగస్వామ్యం, వైద్య చికిత్స నిర్ణయాలలో రోగులు వారి కుటుంబ సభ్యుల భాగస్వామ్యం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని ఈ సందర్భంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్మికులకు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది, కార్మికులకు అసంక్రమిత్ర వ్యాధులు రక్తపోటు,మధుమేహం పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి మందులు ఇవ్వడం జరిగింది.
వడ్డెర కాలనీ లో డ్రై డే ఫ్రైడే
డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రభుదాస్ వైద్య సిబ్బంది వడ్డెర కాలనీ వాసులకు డ్రైడే ఫ్రైడే,డ్రై డే ట్యూస్డే మీద అవగాహన కల్పించారు,డ్రై డే పాటించడం వల్ల దోమలు వృద్ధి చెందకుండా, పుట్టకుండా,కుట్టకుండ ఉండడం జరుగుతుందని.
డెంగ్యూ,మలేరియా, చికెన్ గునియా మన దరికి రావని ఒకవేళ డ్రైడే పాటించకపోతే అనారోగ్యం బారిన పడతారని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపాటించాలని, అనుకోకుండా అనారోగ్యం బారిన పడితే అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైద్య సిబ్బందిని సంప్రదించాలని ప్రభుత్వవైద్యాన్ని. వినియోగించుకోవాలని వారికి వివరించారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సదానందం, శరత్, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్, సబ్ యూనిట్ ఆఫీసర్ రాజేందర్ రాజు, ఆరోగ్యశాఖ సిబ్బంది సాజిదా పర్వీన్, నరేందర్ మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




