Sircilla: సిరిసిల్ల ఎస్పీ ఆఫీస్‌లో పండుగ సాయన్న జయంతి
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Sircilla: సిరిసిల్ల ఎస్పీ ఆఫీస్‌లో పండుగ సాయన్న జయంతి
రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పండుగ సాయన్న ముదిరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీఐ రవి, ఆర్‌ఐ రమేష్, ఎస్‌ఐ కిరణ్, ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాస్‌తో పాటు పోలీస్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.




