Peddapalli: రైతు సమస్యల పరిష్కారానికి పెద్దపల్లిలో కరపత్రం ఆవిష్కరణ!

Peddapalli: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు సమస్యల సాధన సమితి ఆధ్వర్యంలో 50 ఏళ్లు నిండిన రైతులకు రూ.7 వేల పెన్షన్, పంట నష్టపరిహారం డిమాండ్లతో కరపత్రం ఆవిష్కరించారు.

RAJU, PEDDAPALLI
Published on: 23 Nov 2026 3:06 PM IST
Peddapalli
X

Peddapalli: రైతు సమస్యల పరిష్కారానికి పెద్దపల్లిలో కరపత్రం ఆవిష్కరణ!

Peddapalli: రాష్ట్రవ్యాప్తంగా ఎల్ నినో కరువుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా వారి సమస్యలు పరిష్కరించాలని, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఎలాంటి కట్టింగ్లు లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తదితర డిమాండ్లతో రైతు సమస్యల సాధన సమితి ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాన్ని పెద్దపల్లి జిల్లా కేంద్రం, వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న, తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గుమ్మడి కొమురయ్య, రైతు సంఘం నాయకులు లక్ష్మణ్, రైతులు మల్లన్న, కిషన్, రాజేశం, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కరపత్రంలో ప్రధాన డిమాండ్లు:

- రైతుల పునర్నిర్మాణం, భారతదేశ పునర్నిర్మాణం

- 50 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు రూ.7,000 పెన్షన్ ఇవ్వాలి

- ప్రతి గ్రామంలో గోదాములు నిర్మించాలి

- ఐకెపి కేంద్రాలను సిమెంటుతో నిర్మించాలి

- భూమి లేని ప్రతి రైతు కుటుంబానికి 2 ఎకరాల భూమి పంపిణీ చేయాలి

- రైతుల ప్రతి పంటకు ఎకరానికి 50 వేల రూపాయల వడ్డీ లేని రుణం ఇవ్వాలి

- రైతులకు అన్ని రకాల జబ్బులకు ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించాలి

- పంట నష్టం కింద ఎకరానికి రూ.30,000 ఇవ్వాలి

- రైతు పండించిన పంటపై ధర నిర్ణయం రైతులకే ఉండాలి.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI