Vemulawada: ప్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం!

Vemulawada: విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు మద్దతు ధర వినియోగించుకోవాలని కోరారు.

BABU, VEMULAWADA
Published on: 23 Nov 2026 2:10 PM IST
Vemulawada
X

Vemulawada: ప్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం!

Vemulawada: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి సహకారం ప్రత్యేక చొరవతో రైతులకు అవసరమైన సౌకర్యాలు. ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఫ్యాక్స్ చైర్మన్ వకుళాభరణం శ్రీనివాస్,ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి గార్లతో కలిసి ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు గారు మాట్లాడుతూ రైతులకు అండగా నిలుస్తూ, వారు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా విక్రయించుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని,

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు,మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకవచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని కొనుగోలు కేంద్రాల్లో ఇతర అవసరమైన సదుపాయాలతో పాటు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం,

ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, రైతుల కష్టానికి తగిన గౌరవం, ప్రతిఫలం దక్కేలా కృషి చేస్తామని రైతు రాజు కావాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పమని రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా,

రైతు రుణమాఫీ, రైతు బీమా,రైతులకు ఉచిత 24 గంటల కరెంటు మరి ఇంకా ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అందిస్తుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, కౌన్సిలర్ కొండ రాజశేఖర్ గార్లు,ఫ్యాక్స్ డైరెక్టర్లు, కోఆప్షన్ సభ్యులు,నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA