Manthani: నాగారంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం!
Manthani: మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని మండలం నాగారంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ కొత్త శ్రీనివాస్, సర్పంచ్ శ్రీదేవి ప్రారంభించారు.
Manthani: నాగారంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం!
Manthani: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్) ఆధ్వర్యంలో నాగారం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు.
ప్యాక్స్ సంఘం చైర్మన్ కొత్త శ్రీనివాస్, నాగారం గ్రామ సర్పంచ్ బెల్లంకొండ శ్రీదేవి సత్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్యాక్స్ డైరెక్టర్ ఉడుత మాధవి, పర్వతాలు యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ రాం రాజశేఖర్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, ఉప సర్పంచ్ ఎరుకల లలిత వెంకటస్వామి, వార్డు సభ్యులు జక్కుల భాగ్యలక్ష్మి కుమార్, రైతులు, హమాలీలు, సంఘ కార్యదర్శి, సిబ్బంది, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.




