Peddapalli: కమాన్ పూర్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం!
Peddapalli: కమాన్ పూర్ మండలంలో వివిధ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు ప్రభుత్వ కేంద్రాలనే సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Peddapalli: కమాన్ పూర్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలో బుధవారం ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జూలపల్లి, పెంచికల్ పేట, నాగారం, రొంపికుంట, గొల్లపల్లి, గుండారం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సింగిల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.
అలాగే సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ప్రభుత్వం అందిస్తున్నదని రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో పాక్స్ ఇన్చార్జి సీఈఓ కుమార్, ఆయా గ్రామాల సర్పంచ్ లు, సింగిల్ విండో డైరెక్టర్లు, ఉప సర్పంచ్ లు,వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, హమాలీలు, సహకార సంఘ సిబ్బంది పాల్గొన్నారు.




