Illanthakunta: ఇల్లంతకుంట మండలంలోని 8 గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం!

Illanthakunta: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పరిధిలోని 8 గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ అంతగిరి సాహిత్య వినయ్ కుమార్.

KALEEM, SIRICILLA
Published on: 6 Nov 2026 4:58 PM IST
Illanthakunta
X

Illanthakunta: ఇల్లంతకుంట మండలంలోని 8 గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం!

Illanthakunta: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో రైతుల సౌకర్యార్థం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతగిరి సాహిత్య వినయ్ కుమార్ ప్రారంభించారు.

నారెడ్డిపల్లె, కందికట్కూర్, కిష్టారావుపల్లె, గూడెంపల్లె, చిక్కుడువానిపల్లె, తెనుగువానిపల్లె, ఇల్లంతకుంట, తాళ్లపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం కుమారస్వామి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మామిడి రాజు, వైస్ చైర్మన్ భరత్ రెడ్డి, ఏవో ప్రవీణ్, ఏఈవోలు అర్చన, మౌనిక, అభిషేక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ఐకేపీ సీసీలు, మహిళా సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA