Sircilla: తంగళ్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మునిగల రాజు ప్రారంభించారు. దళారులను నమ్మి రైతులు నష్టపోవద్దని సూచించారు.
Sircilla: తంగళ్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం!
Sircilla: తంగళ్లపల్లి మండలంలోని రామన్నపల్లె, బస్వాపూర్, నరసింహుల పల్లె,ఇందిరానగర్,భారత్ నగర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక సర్పంచులు ఆత్మకూరు జ్యోతి అనిల్,పూర్మాని రాజశేఖర్ రెడ్డి,చెక్కపల్లి శరణ్య లింగారెడ్డి,చిట్యాల దేవేంద్ర వెంకన్న లతో కలిసి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మునిగల రాజు ప్రారంభించారు.
రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.మద్దతు ధర కంటే తక్కువకు దళారులకు అమ్మి నష్టపోవద్దని రైతులకు సూచించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మునిగల రాజు.
తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటుంది.అధైర్య పడవద్దని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని,రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి,కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్,ఉప సర్పంచ్లు శరత్,శ్రీనివాస్,నాయకులు మందాటి తిరుపతి యాదవ్,నలువాల జలంధర్ రెడ్డి,ఎడ్ల తిరుపతి,నక్క సురేష్,సిరిసిల్ల మహేష్, దేవరాజు,కావటి మల్లేశం,సురేష్,శ్రీధర్,తిరుపతి,జనార్దన్,భాను, నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.




