Karimnagar: ఒక్క నిమిషం ఆలస్యం.. యువకుడి ఎస్సై కలలకు బ్రేక్!
Karimnagar: కరీంనగర్‌లోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీ పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్ ప్రింట్ కోసం వెళ్లి ఒక్క నిమిషం ఆలస్యంగా రావడంతో జమ్మికుంట యువకుడు ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష కోల్పోయాడు.
Karimnagar: ఒక్క నిమిషం ఆలస్యం.. యువకుడి ఎస్సై కలలకు బ్రేక్!
Karimnagar: ఎస్సై పరీక్షల నిర్వహణలో ఒక్క నిమిషం నిబంధన ఓ యువకుడి ఎన్నో రోజులు పడ్డ కష్టం నెలల తరబడి చేసిన శ్రమ నిరాశగా మారింది. ఎస్సై ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణలో కఠినంగా అమలు చేస్తున్న ఒక్క నిమిషం నిబంధన ఉండడంతో జమ్మికుంట మండల కోరపల్లికి చెందిన అంజి ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష రాయడానికి కరీంనగర్ చేరుకున్నారు.
కరీంనగర్లోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో పరీక్ష రాయడానికి చేరుకున్న సమయంలో అంజి తొందరపాటులో హడావుడిలో హాల్ టికెట్ మర్చిపోయిన అనే విషయాన్ని గమనించి దగ్గర్లోని నెట్ సెంటర్ కి వెళ్లి వచ్చేసరికి సమయం దాటిపోయింది. సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోకపోవడంతో అతడిని పోలీసులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు.
నిబంధనల ప్రకారం గేట్లు మూసివేయడంతో చేసేదేమీ లేక అంజి కన్నీటి పర్యంతం తో వెనుతిరిగాడు. ఒక్క నిమిషం ఆలస్యం అతడు కన్న కలలు కలలుగానే మిగిలిపోయాయి. నెలల తరబడి పడ్డ శ్రమకు ఒక్క నిమిషం ఆలస్యం అడ్డుకట్ట వేసింది నిరుద్యోగ యువకుడి ఆశలపై నీళ్లు చల్లింది. ఈ సంఘటన అక్కడ ఉన్నవారి మనుసులను కలచివేసింది.




