Sircilla: బద్దెనపల్లి వద్ద కారు–ఆటో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి వద్ద కారు, ఆటో ఢీకొని యాసిన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.

KALEEM, SIRICILLA
Published on: 10 Nov 2026 1:24 PM IST
Sircilla
X

Sircilla: బద్దెనపల్లి వద్ద కారు–ఆటో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి వద్ద మంగళవారం కారు, ఆటో ఢీకొన్న రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో యాసిన్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అత్యవసర అంబులెన్స్‌కు సమాచారం అందించారు. దీంతో ఈఎంటీ గూగులోతు శ్రీకాంత్, పైలట్ ప్రవీణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA