Sircilla: సిరిసిల్లలో సాధారణ ప్రసవాలపై నర్సింగ్ విద్యార్థుల అవగాహన ర్యాలీ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సొసైటీ ఆఫ్ మిడ్ వైవ్స్ ఇండియా ఆధ్వర్యంలో సాధారణ ప్రసవాల ప్రాముఖ్యతపై ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Sircilla: సిరిసిల్లలో సాధారణ ప్రసవాలపై నర్సింగ్ విద్యార్థుల అవగాహన ర్యాలీ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సొసైటీ ఆఫ్ మిడ్ వైవ్స్ ఇండియా ఆధ్వర్యంలో సాధారణ ప్రసవాల ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బతుకమ్మ ఘాట్ వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా సాధారణ ప్రసవాల వల్ల తల్లికి, బిడ్డకు కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, అవసరమైన వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని ప్రజలకు అవగాహన కల్పించారు. సాధారణ ప్రసవాలపై అపోహలను తొలగించి, వాటిని ప్రోత్సహించే దిశగా వైద్య సిబ్బంది, ప్రజలు కలిసి పనిచేయాలని సందేశాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ శ్రీదేవి సోమి తదితరులు పాల్గొన్నారు.




