Peddapalli: క్రిస్మస్ సత్కారాలకు ప్రతిభావంతుల నుంచి నామినేషన్ల ఆహ్వానం: కలెక్టర్!
Peddapalli: క్రిస్మస్ 2026 సత్కారాలకు ప్రతిభావంతులైన క్రైస్తవ వ్యక్తులు, సంస్థల నుంచి నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
Peddapalli: క్రిస్మస్ సత్కారాలకు ప్రతిభావంతుల నుంచి నామినేషన్ల ఆహ్వానం: కలెక్టర్!
Peddapalli: క్రిస్మస్ పండుగ 2026 సందర్భంగా నిర్వహించనున్న క్రిస్మస్ సంబరాల్లో భాగంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవ, ప్రతిభ కనబరిచిన క్రైస్తవ వ్యక్తులు, సంస్థలను తెలంగాణ ప్రభుత్వం సత్కరించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సామాజిక, వైద్య, విద్య, సాహిత్యం, కళా, క్రీడా రంగాల్లో 10 సంవత్సరాలకు పైబడి ఉత్తమ సేవలు, ప్రతిభ కనబరిచిన వ్యక్తుల నుండి నామినేషన్లు స్వీకరించనున్నట్లు, వైద్య, విద్య, సామాజిక రంగాల్లో 25 సంవత్సరాలకు పైబడి ఉత్తమ సేవ అందించిన సంస్థలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ (మైనారిటీస్) ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు, నామినేషన్ ఫారాలను హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ (మైనారిటీస్) ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం నుండి వ్యక్తిగతంగా గాని, http://www.tgcmfc.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
పూర్తి చేసిన నామినేషన్ ఫారాలను నవంబర్ 30, సాయంత్రం 5 గంటలలోపు పెద్దపల్లిలోని జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని, ఈ అవకాశాన్ని అర్హులైన క్రైస్తవ వ్యక్తులు, సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాల కోసం 040-23391067 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.




