Sircilla: స్మశానవాటికకు దారి లేదు: సంజీవయ్యనగర్ దళితుల ఆవేదన
Sircilla: రాజన్న సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్యనగర్ దళితులు స్మశానవాటికకు దారి లేక కాలువ దాటుతూ ఇబ్బందులు పడుతున్నారు. శాశ్వత రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Sircilla: స్మశానవాటికకు దారి లేదు: సంజీవయ్యనగర్ దళితుల ఆవేదన
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్యనగర్ దళితుల కాలనీ ప్రజలు స్మశానవాటికకు వెళ్లేందుకు రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త చెరువుకు సంబంధించిన మత్తడి కాలువను దాటుకుంటూ స్మశానవాటికకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్మశానవాటికకు వెళ్లేందుకు ప్రత్యేకంగా రహదారి నిర్మించాలని కోరుతూ పలుమార్లు అధికారులను ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాలేదని నివాసితులు చెబుతున్నారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు మున్సిపల్ కమిషనర్‌కు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంటున్నారు.
కాలనీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు స్పందించాలని, దళితుల కాలనీ పట్ల నిర్లక్ష్యం వహించకుండా స్మశానవాటికకు శాశ్వత రహదారి నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




