Sircilla: సిరిసిల్లలో 12వ రోజుకు చేరిన ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె
Sircilla: సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద NHM ఉద్యోగుల సమ్మె 12వ రోజుకు చేరింది. క్రమబద్ధీకరణ, పేస్కేల్ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే చర్చించాలని JAC నేతలు కోరారు.
Sircilla: సిరిసిల్లలో 12వ రోజుకు చేరిన ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో సుమారు 17 వేల మంది ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె కొనసాగిస్తున్నారు.
12 రోజులుగా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఉద్యోగులు వివిధ రూపాల్లో శాంతియుత నిరసనలు చేపడుతున్నారు. ఒంటికాలిపై నిలబడటం, ప్లకార్డుల ప్రదర్శన, కళ్లకు గంతలు కట్టుకోవడం, భిక్షాటన వంటి వినూత్న నిరసనల ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. అయినప్పటికీ చర్చలకు పిలుపు రాకపోవడం బాధాకరమని NHM జేఏసీ నాయకులు, మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగాలను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని, మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడంతో పాటు పీఆర్సీ అమలు చేయాలని, ఐదు శాతం వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి వెంటనే చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని NHM జేఏసీ తెలంగాణ విజ్ఞప్తి చేసింది. చర్చలు జరిగి డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు నిరవధిక సమ్మెను శాంతియుతంగా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. సమ్మె ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరారు.




