Sircilla: ఇల్లంతకుంట మండల యాదవ సంఘం నూతన కార్యవర్గానికి ఘన సన్మానం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల నూతన యాదవ సంఘం అధ్యక్ష, కార్యవర్గ సభ్యులను ఓగులపూర్, గొల్లపల్లి గ్రామాల నాయకులు ఘనంగా సన్మానించారు.

KALEEM, SIRICILLA
Published on: 1 Nov 2026 1:12 PM IST
Sircilla
X

Sircilla: ఇల్లంతకుంట మండల యాదవ సంఘం నూతన కార్యవర్గానికి ఘన సన్మానం!

Sircilla: ఇల్లంతకుంట మండల నూతన యాదవ సంఘం కార్యవర్గానికి ఓగులపూర్‌, గొల్లపల్లి గ్రామాల యాదవ సంఘం నాయకులు ఘనంగా సన్మానం చేశారు. నూతనంగా ఎన్నికైన మండల యాదవ సంఘం అధ్యక్షుడు ఒరుపుల రాములు యాదవ్‌తో పాటు కార్యవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మండల యాదవ సంఘం అధ్యక్షుడు ఒరుపుల రాములు యాదవ్‌, ఉపాధ్యక్షుడు గంట రంజాన్ యాదవ్‌, గౌరవ అధ్యక్షుడు మల్లేశం, కోశాధికారి రాజశేఖర్‌, కార్యదర్శి రాజయ్య, కార్యవర్గ సభ్యుడు మేడకొక్కుల దేవరాజులను శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఓగులపూర్ యాదవ సంఘం అధ్యక్షుడు నూకల పరశురాములు, గొల్లపల్లి యాదవ సంఘం అధ్యక్షుడు దాసరి ఎల్లయ్య, నాయకులు జక్కుల శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు మేడకొక్కుల కనుకయ్య, కార్యదర్శి ఆత్మకూరి దేవయ్య, కోశాధికారి నూకల శ్రీశైలం, మాజీ అధ్యక్షుడు నూనె అయిలయ్య, మాజీ సర్పంచ్ ఎరవెల్లి మల్లయ్య, పిల్లి కనకయ్య, రాధరపు పరశురాములు, గొల్లపల్లి యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి ఒరుపుల పరశురాములు, ఉపసర్పంచ్ ఒరుపుల లక్ష్మణ్‌, కుడుదల రాజు, సొసైటీ అధ్యక్షులు, మాజీ యాదవ సంఘం అధ్యక్షులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA