Karimnagar: కరీంనగర్‌లో నూతన ట్రాఫిక్ ఔట్‌పోస్ట్ బూత్‌లు ప్రారంభం!
Karimnagar: కరీంనగర్ తెలంగాణ చౌక్, మంచిర్యాల చౌరస్తాలో నూతన ట్రాఫిక్ ఔట్‌పోస్ట్ బూత్‌లను ప్రారంభించిన పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం.
Karimnagar: కరీంనగర్‌లో నూతన ట్రాఫిక్ ఔట్‌పోస్ట్ బూత్‌లు ప్రారంభం!
Karimnagar: నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా తెలంగాణ చౌక్, మంచిర్యాల చౌరస్తాలో ఏర్పాటు చేసిన నూతన ట్రాఫిక్ ఔట్‌పోస్ట్ బూత్‌లను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడంతో పాటు నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ ఔట్‌పోస్ట్ బూత్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామితో పాటు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య, సబ్-ఇన్‌స్పెక్టర్లు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.




