Sircilla: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం!
Sircilla: సిరిసిల్ల జిల్లాలో నూతనంగా నియమితులైన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Sircilla: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ పాలకవర్గం!
Sircilla: నూతనంగా నియమితులైన సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ సత్తు శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ గుగ్గిళ్ల శ్రీకాంత్ గౌడ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు తొలిసారిగా వారిని కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు.
రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వ్యవసాయ మార్కెట్‌లో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పాలకవర్గ సభ్యులు తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా మార్కెట్ కమిటీని ముందుకు తీసుకెళ్తామని, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వ సహకారంతో మార్కెట్ కమిటీని మరింత అభివృద్ధి చేసి, రైతులకు అందుబాటులో ఉండేలా పాలకవర్గమంతా సమష్టిగా పనిచేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.




