Sircilla: గొల్లపల్లిలో అదనపు ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం సర్పంచ్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా గొల్లపల్లి గ్రామంలో లో-ఓల్టేజీ సమస్య పరిష్కారానికి అదనపు ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్.
Sircilla: గొల్లపల్లిలో అదనపు ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం సర్పంచ్!
Sircilla: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ తెలిపారు. గ్రామంలోని 12వ వార్డులో దీర్ఘకాలంగా నెలకొన్న లో ఓల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ అధికారుల సహకారంతో అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ప్రారంభించినట్లు వెల్లడించారు.
సర్పంచ్‌గా పోటీ చేసిన సమయంలో 12వ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న లో ఓల్టేజీ సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని రమేష్ గౌడ్ తెలిపారు. ఎన్నికల్లో గెలిస్తే అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయిస్తానని ఇచ్చిన హామీ మేరకు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటే లక్ష్యం
గ్రామంలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఇందుకోసం అవసరమైన స్థలం కొనుగోలు చేసే అంశంపై గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామస్థులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.
బైపాస్ రోడ్డులో విద్యుత్ దీపాల ఏర్పాటు
బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామంలోని బైపాస్ రోడ్డులో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించడంతో పాటు, గ్రామ పంచాయతీ నిధులతో విద్యుత్ దీపాలను అమర్చినట్లు రమేష్ గౌడ్ తెలిపారు. దీంతో బైపాస్ రోడ్డులో వెలుగులు నిండాయని పేర్కొన్నారు.
అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు సహకరించిన నాయకులు, బతుకమ్మ వేడుకల సందర్భంగా విద్యుత్ స్తంభాల తరలింపులో సహకరించిన యువకులు, విద్యుత్ సిబ్బంది, గ్రామస్థులతో పాటు ప్రారంభోత్సవానికి హాజరైన నాయకులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులకు సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.




