Sircilla: సర్దార్ పటేల్ ఐక్యతా స్ఫూర్తితో ముందుకు సాగాలి: గడ్డం నగేష్

Sircilla: రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఐడీఓసీలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 31 Oct 2026 4:11 PM IST
Sircilla
X

Sircilla: సర్దార్ పటేల్ ఐక్యతా స్ఫూర్తితో ముందుకు సాగాలి: గడ్డం నగేష్

రాజన్న సిరిసిల్ల: సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పేర్కొన్నారు. భారత తొలి ఉప ప్రధాని, మాజీ కేంద్ర హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లోని ఆడిటోరియంలో జాతీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి, దేశ సమగ్రతకు విశేష కృషి చేసిన ఉక్కుమనిషి పటేల్ అని కొనియాడారు. ఆయన చూపిన ఐక్యతా మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏవో రాంరెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA