Jammikunta: జాతీయస్థాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అవార్డు సొంతం చేసుకున్న రాంబాబు!

Jammikunta: సిగ్మా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్‌లో జమ్మికుంట ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబు సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ సాధించారు.

GANESH, JAMMIKUNTA
Published on: 2 Oct 2026 7:07 PM IST
Jammikunta
X

Jammikunta: జాతీయస్థాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అవార్డు సొంతం చేసుకున్న రాంబాబు!

Jammikunta: సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్లో సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు. జమ్మికుంటకు చెందిన ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబు ఎంపికయ్యారు. ఈ మేరకు సిగ్మా అకాడమీ ప్రధాన కార్యదర్శి కోరముళ్ళ జనార్ధన్, సిగ్మా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంసీ శేఖర్ హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో రాంబాబు వారి చేతుల మీదుగా అవార్డు అందజేస్తారు. సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ, తెలంగాణ ప్రభుత్వం త్వరలో భాషా సంస్కృతికి సంబంధించిన ఫోటోగ్రఫీ ప్రదర్శనకు సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెంట్ ఎగ్జిబిటర్ అవార్డును సైతం రాంబాబు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాంబాబును పలువురు ఫోటోగ్రాఫర్లు అభినందించారు.

నాలుగు దశాబ్దాలుగా ఫోటోగ్రఫీ వృత్తినే జీవితం గా మలుచుకున్న రాంబాబు విభిన్నమైన ఛాయాచిత్రాలతో జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నాడు. 2007, 2010 లో లంబాడీ జీవనశైలిని తన కెమెరా ద్వారా ఆవిష్కరించి జిల్లా స్థాయిలో రాణించారు. 2011 వరంగల్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో బహుమతి సాధించాడు.

ఖమ్మంలో నిర్వహించిన 187 వ ప్రపంచ ఫోటోగ్రఫీ పోటీలు 2026 లో రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో తృతీయ బహుమతి సాధించినారు హైదరాబాద్ కేబీఆర్ పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో 2025లో నిర్వహించిన కెమెరా కళ్ళు పోటీలో రాంబాబు రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం పొందాడు. 2016 ఖమ్మంలో నిర్వహించిన జాతీయస్థాయి ఫోటో వర్క్ షాప్ లో పర్యాటక విభాగంలో రాంబాబు ద్వితీయ స్థానం సాధించాడు. గిరిజనులు ఆదివాసీల జీవనశైలిని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రకృతి రమణీయతల్ని తన చిత్రాల ద్వారా ఆవిష్కరించడంలో రాంబాబుది ప్రత్యేకంగా కనబడుస్తున్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA