Sircilla: మణికుమార్ మృతి పట్ల కేసీఆర్, శోభమ్మ తీవ్ర దిగ్భ్రాంతి!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ బంధనకల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అటెండర్ మణికుమార్ కుటుంబానికి అండగా ఉంటామని మాజీ సీఎం కేసీఆర్, శోభమ్మ హామీ ఇచ్చారు.
Sircilla: మణికుమార్ మృతి పట్ల కేసీఆర్, శోభమ్మ తీవ్ర దిగ్భ్రాంతి!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మణికుమార్ కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. మణికుమార్ మృతిపట్ల కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మణికుమార్ ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో కొన్నేళ్లుగా అటెండర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబంలో ఒకరిగా కలిసిపోయిన మణికుమార్ అకాల మరణం తమను తీవ్రంగా కలచివేసిందని శోభమ్మ, శైలిమ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు హిమాన్షు ఆవేదన వ్యక్తం చేశారు.
మణికుమార్ అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించాలని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ముస్తాబాద్ మాజీ జెడ్పీటీసీ శరత్ రావులకు కేసీఆర్ సూచించారు. మరోవైపు మణికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా, జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆస్పత్రిని సందర్శించారు.




