Karimnagar: ఇల్లందకుంట మండలం రాచపల్లిలో మత సామరస్యం చాటిన ముస్లిం వ్యక్తి!
Karimnagar: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లిలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఘటన.. వినాయకుడి లడ్డూను వేలంలో దక్కించుకున్న ముస్లిం వ్యక్తి మహమ్మద్ అక్బర్.
Karimnagar: ఇల్లందకుంట మండలం రాచపల్లిలో మత సామరస్యం చాటిన ముస్లిం వ్యక్తి!
Karimnagar: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామంలో వినాయకుడి లడ్డూను వేలంలో దక్కించుకున్న ముస్లిం వ్యక్తి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటన ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకుడి లడ్డూను 3116 రూ.వేలం నిర్వహించగా, అదే గ్రామానికి చెందిన ముస్లిం వ్యక్తి మహమ్మద్ అక్బర్ వేలంలో పాల్గొని లడ్డూను దక్కించుకున్నారు.వినాయకుడి లడ్డూ వేలంలో అక్బర్ పాల్గొని లడ్డూను తీసుకోవడం గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మతాలకు అతీతంగా ఐక్యత, సోదరభావంతో పండుగలను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.రాచపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన మత సామరస్యం,పరస్పరసోదరభావానికి నిదర్శనంగా నిలిచిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాజీ లాలు గ్రామస్తులు పాల్గొన్నారు.




