Karimnagar: కరీంనగర్ బల్దియా భేటీ.. నీరు వృథా చేస్తే రూ.1000 జరిమానా!

Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ అత్యవసర సర్వసభ్య సమావేశంలో 10 ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 21 Nov 2026 7:19 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ బల్దియా భేటీ.. నీరు వృథా చేస్తే రూ.1000 జరిమానా!

Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ అత్యవసర సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం నగర ప్రథమ పౌరులు మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు సమక్షంలో 10 ఎజెండా అంశాల పై చర్చించి పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

ఉదయం 11:00 గంటలకు తెలంగాణ రాష్ట్ర గేయం, వందేమాతర గీతంతో ప్రారంభంమైన అత్యవసర సర్వ సభ్య సమావేశం ప్రారంభమై మద్యాహ్నం 1:30 గంటలకు జాతీయ గీతంతో ముగిసింది. సర్వ సభ్య సమావేశం ప్రశ్నోత్తరాల సమయంలో పాలకవర్గ సభ్యులు పలు రకాల ప్రజా సమస్యలను సభ దృష్టికి తేవడం జరిగింది.

మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వాహాణ, కుక్కలు, కోతుల బెడద, అంతర్గత రహదారుల విస్తరణ మరమ్మతులు,భువన్ సర్వే, ప్లాస్టిక్ నిర్మూలన, ఎల్ నినో, ఇంకుడు గుంతలు తదితర అంశాలు, సమస్యల పై సుదీర్ఘంగా సభలో చర్చించారు.

సభ్యులు లేవనెత్తిన సమస్యలను సావధానంగా విన్న మేయర్ కొలగాని శ్రీనివాస్, వాటి పరిష్కారంపై తక్షణమే దృష్టి సారించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ప్రధానంగా పెరిగిన నగర విస్తీర్ణం. జనాభా ప్రకారం పారిశుధ్య కార్మీకులను పెంచేందుకు సీడీఎంఏ నిబంధనలను పాటిస్తూ నియామక ఆమోదం కోసం సభలో తీర్మాణం చేశారు.

ఎల్ నినో ప్రభావం దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవడంనీటి వృధాను అరికట్టేందుకు నీటిని వృధా చేస్తే 500 నుండి 1000 రూ. జరిమానా విధించేందుకు తీర్మాణం ప్రవేశపెట్టి సభ్యులు ఆమోదం తెలిపారు. కరీంనగర్ ను ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా మార్చేదిశగా ప్లాస్టిక్ నివారణ చర్యలో భాగంగా ఫంక్షన్ హాల్స్ ఇతర చోట్ల ప్లాస్టిక్ వాడకం పై 5 వేల నుండి 25 వేల రూపాయిల జరిమానా విధించేందుకు తీర్మాణం ప్రవేశపెట్టి సభ్యులు ఆమోదం తెలిపారు.

నగర నీటి సరఫరా లీకేజీలను అరికట్టేందుకు గతంలో ఉన్న లీకేజీ లేబర్లను తొలగించిన నేపథ్యంలో మల్లి తిరిగి వారినే లీకేజీ లేబర్లుగా తీస్కునేందుకు 55 మందిని 4 మాసాల పాటు నియమించుకునేలా తీర్మాణం చేసి ఆమోదించారు.

నగర వ్యాప్తంగా వార్డు కార్యాలయాల నిర్మాణం, ఎల్ నినో ప్రభావం దృష్ట్యా నగరంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేసేందుకు కూడ సభలో తీర్మాణాలు ప్రవేశపెట్టి సభ్యులు ఆమోదం చేశారు. నగర ప్రజల సమస్యలను యుద్ద ప్రాతిపదికన పరిష్కరించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన చేసేందుకు సర్వ సభ్య సమావేశం లో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ... ఎల్ నినో ప్రభావం దృష్ట్యా రాబోయే రోజుల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలో భాగంగా అత్యవసర సర్వ సభ్య సమావేశం లో పలు నిర్ణయాల పై పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదం చేయడం జరిగిందని తెలిపారు. నగరంలో నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని పిలుపు నిచ్చారు.

నిర్లక్ష్య దోరణితో నీటిని ఎవరైనా వృధా చేస్తే 500 నుండి 1000 రూ. జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. నగరంలో నీటిని ఒడిసి పట్టేందుకు నగరపాలక సంస్థ ఇంకుడు గుంతల నిర్మాణం కు శ్రీకారం చుట్టనుందని తెలిపారు. నగర వ్యాప్తంగా ఇంకుడు గుంతలను ప్రభుత్వ కార్యాలయాల స్థలాలు, మందిరాలు, గుడులు, అంగన్ వాడి, ప్రభుత్వ పాఠశాలలు, సంఘ భవనాలు, ఆరోగ్య కేంద్రాలు తదితర ప్రాంతాల్లో నిర్మాణం చేసేందుకు సర్వ సభ్య సమావేశం లో తీర్మాణం చేయడం జరిగిందని తెలిపారు.

ఇప్పటికే ఇంకుడు గుంతల నిర్మాణం కోసం 66 డివిజన్లలో డివిజన్ కు 2 లక్షల నిధులను కూడ కేటాయించి టెండర్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. అంతే కాకుండా నూతనంగా భవనాలు, అపార్ట్ మెంట్ల నిర్మాణం చేసే సమయంలో అనుమతి పత్రాల జారీ కొసం తప్పని సరి ఇంకుడు గుంతల నిర్మాణం చేయాలనే నిబంధనను కూడ పెట్టామని తెలిపారు.

నగరంలో అభివృద్ధి పనులు జరిగే ప్రదేశాల్లో కూడ ప్రత్యేకంగా ప్రతి చోట ఒక ఇంకుడు గుంత, మొక్కను ఏర్పాటు చేసేలా పాలకవర్గం తీర్మాణం చేసిందని తెలిపారు. నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా మార్చడమే ద్యేయంగా ప్లాస్టిక్ నివారణ చర్యలు చేపడుతున్నట్ల తెలిపారు.

ఫంక్షన్ హాల్, ఇతర చోట్ల ఎక్కడ ప్లాస్టిక్ వాడినా సంబంధిత సంస్థలకు 5 నుండి 25 వేల జరిమానా విధించేందుకు తీర్మాణం చేయడం జరిగిందని తెలిపారు. అంతే కాకుండా ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన పై సభ్యులు సభ దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరించేలా చర్యలు తీస్కుంటామని తెలిపారు.

ప్రధానంగా నగర విస్తీర్ణం పెరిగి పారిశుధ్య పనులకు చాలా ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో పారిశుధ్య కార్మీకులను డివిజన్ కు ఒకరు చొప్పున పెంచేందుకు కొత్తగా వారిని రిక్రూట్ చేస్కునేందుకు సీడీఎంఏ నిబంధనల ప్రకారం సభలొ తీర్మాణం చేసి ఆమోదంకు పంపినట్లు తెలిపారు. నగరంలో లీకేజీలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీస్కుంటామని గతంలో లీకేజీ లేబర్లు ఉండేవారని ప్రస్తుతం వారు లేకపోవడంతో చాలా సమస్యలు తలెత్తుతున్నాయని మల్లీ వారిని 4 నెలల పాటు తీస్కునేందుకు 55 మందిని నియామకం కోసం సభలో ఆమోదం తెలిపామన్నారు.

నగరంలో వీది దీపాల నిర్వాహాణ కోసం కొత్తగా లైట్ల కొనుగోలు కోసం 70 లక్షలతో ఒకటి 95 లక్షలతో మరోకటి 5 సంవత్సరాల వారంటీతో టెండర్ ప్రక్రియ చేపట్టామని తెలిపారు. నగర వ్యాప్తంగా వీది దీపాల నిర్వాహాణ సక్రమంగా జరిగేలా చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు.

ప్రధానంగా కోతులు, కుక్కల బెడద కోసం నగరపాలక సంస్థ నిరంతర ప్రక్రియ చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. నగరంలో అన్ని డివిజన్లలో ప్రభుత్వ స్థలాలున్న చోట వార్డు కార్యాలయాల నిర్మాణం చేపడుతామని తెలిపారు. నగరంలో చేయుత పెన్షన్ల కింద మొత్తం 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని ఇందులో 3812 పెన్షన్ మంజూరు పత్రాలు అందించామని తెలిపారు.

త్వరలోనే ఇంకా కొన్ని పెన్షన్ మంజూరు పత్రాలు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేస్తే అలాంటి వారికి కూడ జరిమానాలు విధించేలా సంబంధిత విభాగం అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న 47 వేల అసెస్మెంట్లకు భువన్ సర్వే కొనసాగుతుందని ప్రస్తుతం ఉన్న స్ట్రక్చర్ ప్రకారం వారికి టాక్స్ రివిజన్ అవుతుందని ఎక్కడ ఎవరికి టాక్స్ పెరగదని స్పష్టం చేశారు.

సభ్యులు సభ దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యను పరిగణలోకి తీస్కోని పరిష్కరించేలా చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. ఈ సర్వ సభ్య సమావేశం లో పాలకవర్గం సభ్యుల, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు, పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR