Sircilla: సిరిసిల్లలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్!

Sircilla: సిరిసిల్లలోని కనకదుర్గ అంబా భవాని, కంచి కామాక్షి ఆలయాల్లో దసరా నవరాత్రి పూజల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు.

KALEEM, SIRICILLA
Published on: 19 Oct 2026 12:56 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్!

Sircilla: సిరిసిల్ల పట్టణంలోని 6వ వార్డులో శ్రీ కనకదుర్గ అంబా భవాని దేవాలయంలో, 39వ వార్డులో శ్రీ కంచి కామాక్షి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోకకల్యాణం కోసం భక్తిశ్రద్ధలతో యజ్ఞయాగాలు, నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, వ్యవసాయం, స్వయం ఉపాధి, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దూడం రజనీ శ్రీనివాస్ దంపతులు, ఆకుల స్వప్న కృష్ణ దంపతులు, బీఆర్ఎస్ నాయకులు తాటి వెంకన్న పద్మ దంపతులు, మాజీ కౌన్సిలర్ చిలక నారాయణ, బీఆర్ఎస్ కార్మిక విభాగం సిరిసిల్ల అధ్యక్షుడు పోరండ్ల రమేష్, బూర భాస్కర్, కన్నె రమేష్, శంకర్‌తో పాటు పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA