Vemulawada: తెలంగాణ చౌక్ దత్తాత్రేయ ఆలయం వద్ద అన్నదానంలో పాల్గొన్న పుల్కం రాజు!

Vemulawada: కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ చౌక్ దత్తాత్రేయ ఆలయం వద్ద తాటిపెళ్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదానంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA
Published on: 24 Nov 2026 9:31 PM IST
Vemulawada
X

Vemulawada: తెలంగాణ చౌక్ దత్తాత్రేయ ఆలయం వద్ద అన్నదానంలో పాల్గొన్న పుల్కం రాజు!

Vemulawada: కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ చౌక్ లోని దత్తాత్రేయ ఆలయం వద్ద తాటిపెళ్ళి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు గారు మాట్లాడుతూ ముందుగా పట్టణ ప్రజలకు కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదని, కార్తీక పౌర్ణమికి విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని అన్నదానం మహాదానమని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదని ప్రతి పౌర్ణమికి భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను వారు అభినందించారు, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సేవాభావం, ఆధ్యాత్మిక చింతనను భక్తి భావాన్ని పెంపొందిస్తాయని వారన్నారు.

ఈ కార్యక్రమంలో గౌరవ కౌన్సిలర్లు అన్నారం శ్రీనివాస్,కొక్కుల బాలకృష్ణ,కో ఆప్షన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్,నిర్వాహకులు దాస్,విజయ్ భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA