Sircilla: వీర్నపల్లిలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన MPDO శ్రీలేఖ, ఎస్‌ఐ. శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని స్పష్టంచేసిన పోలీసులు.

KALEEM, SIRICILLA
Published on: 22 Sept 2026 12:16 PM IST
Sircilla
X

Sircilla: వీర్నపల్లిలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు!

Sircilla: వీర్నపల్లిలో జరగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి వెంకటరాయిని చెరువును వీర్నపల్లి MPDO శ్రీలేఖ, ఎస్‌ఐ పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి, పంచాయతీ సిబ్బందికి నిమజ్జన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లపై తగిన సూచనలు చేశారు. వినాయక నిమజ్జనాన్ని ఎలాంటి గొడవలు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, సంతోషంగా నిర్వహించుకోవాలని ఎస్‌ఐ కోరారు.

నిమజ్జనం సమయంలో చెరువులు, కుంటల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా నిమజ్జనం చేసే సమయంలో భద్రతా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

అదేవిధంగా వినాయక నిమజ్జన శోభాయాత్రల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని వీర్నపల్లి ఎస్‌ఐ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేస్తే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA