Peddapalli: అయ్యప్ప స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Peddapalli: పెద్దపల్లి పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ అయ్యప్ప స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు.

RAJU, PEDDAPALLI
Published on: 17 Nov 2026 2:32 PM IST
Peddapalli
X

Peddapalli: అయ్యప్ప స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వాములతో కలిసి భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు.

ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తి, సేవాభావం, సమానత్వం వంటి విలువలు సమాజంలో మరింత బలపడాలని పేర్కొన్నారు.

అయ్యప్ప స్వాముల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వం, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI