Peddapalli: ఘనంగా 'సంఘం శరణం గచ్చామి' కార్యక్రమం.. హాజరైన ఎంపీ వంశీకృష్ణ!
Peddapalli: పెద్దపల్లి ఎన్.ఎస్ భవన్లో అభ్యుదయ కళాబృందం ఆధ్వర్యంలో అంబేద్కర్ జీవిత చరిత్రపై నిర్వహించిన 'సంఘం శరణం గచ్చామి' కార్యక్రమానికి ఎంపీ వంశీకృష్ణ హాజరయ్యారు.
Peddapalli: ఘనంగా 'సంఘం శరణం గచ్చామి' కార్యక్రమం.. హాజరైన ఎంపీ వంశీకృష్ణ!
Peddapalli: పెద్దపల్లి పట్టణంలోని ఎన్.ఎస్ భవన్లో అభ్యుదయ కళాబృందం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవిత చరిత్ర ఆధారంగా "సంఘం శరణం గచ్చామి" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ... అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా, సంఘ సంస్కర్తగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కళాబృందం సభ్యులు అంబేద్కర్ జీవిత ప్రయాణం, ఆయన ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలు, సమాజ అభ్యున్నతి కోసం చేసిన పోరాటం, రాజ్యాంగ రచనలో ఆయన పాత్ర గురించి నాటకం, పాటల రూపంలో ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు.
అంబేద్కర్ ఆశయాలైన సమానత్వం, సామాజిక న్యాయం, విద్య, ఐక్యత వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




