Sircilla: కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా జనరల్ సెక్రటరీగా మహమ్మద్ పర్వేజ్ నియామకం!

Sircilla: కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా జనరల్ సెక్రటరీగా మహమ్మద్ పర్వేజ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ నియామక పత్రం అందజేశారు.

KALEEM, SIRICILLA
Published on: 26 Sept 2026 6:30 PM IST
Sircilla
X

Sircilla: కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా జనరల్ సెక్రటరీగా మహమ్మద్ పర్వేజ్ నియామకం!

Sircilla: కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా జనరల్ సెక్రటరీగా మహమ్మద్ పర్వేజ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.

పార్టీపై నమ్మకంతో కార్యకర్తగా పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని గుర్తించి జిల్లా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి మహమ్మద్ పర్వేజ్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు కృషి చేస్తానన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పనిచేస్తానని పేర్కొన్నారు.

మహమ్మద్ పర్వేజ్ నియామకంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన జిల్లా కాంగ్రెస్ నాయకత్వానికి, పార్టీ పెద్దలకు, కార్యకర్తలకు మహమ్మద్ పర్వేజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA