Peddapalli: కాల్వ శ్రీరాంపూర్‌లో ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు!

Peddapalli: కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం మరియు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ.

KONDAL, SULTANABAD
Published on: 17 Sept 2026 5:54 PM IST
Peddapalli
X

Peddapalli: కాల్వ శ్రీరాంపూర్‌లో ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఆవరణలో తెలంగాణ విమోచన దినోత్సవం మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

సేవా సంకల్పం అభియాన్ మండల కన్వీనర్ రాగుల రాజు కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్ల మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నాయకులు కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికపై అగ్రగామిగా ఎదుగుతోందని, ఆయన పరిపాలన దేశానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, శక్తివంతంగా ఉంటూ దేశ సేవలో ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు.

మోదీ ప్రవేశపెట్టిన పథకాలు పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతీ ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరుల త్యాగాలు అమూల్యమైనవని, వారి పోరాట స్ఫూర్తిని కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కాసాగోని నిర్మల, మండల నాయకులు చిలువరి సంపత్ కుమార్, చల్ల చంద్రమౌళి, మర్రి రాములు, సంతోష్, ఎండి రఫీక్, చిక్కుల శివకుమార్, ఉమేష్, రాజు, అల్లం శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD