Yellareddypet: మూతపడే స్థితిలో ఉన్న డిగ్రీ కళాశాలను ఆదుకున్న ఎమ్మెల్సీ కవిత!
Yellareddypet: ఆర్థిక ఇబ్బందులతో మూతపడే స్థితిలో ఉన్న ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎమ్మెల్సీ కవిత రూ.1,30,800 ఫీజు చెల్లించి అండగా నిలిచారు.
Yellareddypet: మూతపడే స్థితిలో ఉన్న డిగ్రీ కళాశాలను ఆదుకున్న ఎమ్మెల్సీ కవిత!
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. శాతవాహన యూనివర్సిటీకి చెల్లించాల్సిన ఫీజు బకాయిలు చెల్లించలేని పరిస్థితి నెలకొనడంతో కళాశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమస్యను గుర్తించిన కళాశాల పరిరక్షణ సభ్యుడు రంజిత్, టీఆర్ఎస్ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మజీద్ దృష్టికి తీసుకెళ్లారు.
మజీద్ ఈ విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె స్పందించారు. కళాశాల పరిరక్షణకు తనవంతు సహకారం అందించేందుకు ముందుకొచ్చి, శాతవాహన యూనివర్సిటీకి చెల్లించాల్సిన రూ.1,30,800 ఫీజును చెల్లించారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కళాశాలకు ఊరట లభించింది.
గ్రామీణ ప్రాంత పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కాపాడేందుకు ఎమ్మెల్సీ కవిత ఆర్థిక సహాయం అందించడంపై కళాశాల పరిరక్షణ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, అధ్యాపకులు, విద్యార్థులు కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మనుగడకు అందరూ సహకరించాలని వారు ఆకాంక్షించారు.




