Peddapalli: సచ్చిదానంద స్వామి ఆశీస్సులు పొందిన విప్ విజయరమణ రావు!
Peddapalli: మంథని పర్యటనకు విచ్చేసిన అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశీస్సులను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రభుత్వ విప్ విజయరమణ రావు అందుకున్నారు.
Peddapalli: సచ్చిదానంద స్వామి ఆశీస్సులు పొందిన విప్ విజయరమణ రావు!
పెద్దపల్లి: అవధూత దత్త పిఠాధిపతి పరమపూజ్య శ్రీశ్రీశ్రీ. గణపతి సచ్చిదానంద స్వామిజీ మంథని మరియు ధన్వడ శుభ పర్యటనకు విచ్చేసిన సందర్బంగా రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారితో కలిసి స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు శివకిరణ్ గార్డెన్స్ లో సచ్చిదానంద స్వామిజీ వారి భక్తి ప్రవచనాలు తిలకించిన గౌరవ ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు.
ముందుగా మంత్రి తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు మేయర్, మున్సిపల్ చైర్మన్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అయ్యగార్లు, స్వామి వారి భక్తులు తదితరులు పాల్గొన్నారు.




